వెనక్కుతగ్గిన అక్కినేని నాగార్జున

Update: 2016-10-05 12:41 GMT

2016 సంక్రాంతికి నందమూరి కథానాయకుల చిత్రాలు డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, యు వి క్రియేషన్స్ వారి ఎక్ష్ప్రెస్స్ రాజా ల తో పండగ బరిలో సోగ్గాడే చిన్ని నాయనాగా వచ్చి తన కెరీర్ లోనే పెద్ద విజయాన్ని సాధించారు అక్కినేని నాగార్జున. ఆ చిత్రం తర్వాత ఆయన నటన కనపరిచే అవకాశం ఉన్న పాత్రలో ఊపిరి చిత్రంలో చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ చిత్ర విజయాల తర్వాత నిర్మల కాన్వెంట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ని వెండి తెరకు పరిచయం చేసారు. ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆ కలయికకు కలిసొచ్చిన పౌరాణిక కథతో ఓం నమో వెంకటేశాయ అనే చిత్రంలో నటిస్తున్నారు.

2016 సంక్రాంతి చిత్రాల పోటీ కన్నా కూడా 2017 లో థియేటర్ల పై అధిక తాకిడి కనపడబోతుంది. కారణం మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.1, నందమూరి బాల క్రిష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి బరిలో ఉండటం. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తాను నిర్మిస్తున్న శతమానం భవతే చిత్రం విడుదల కోసం థియేటర్లను బ్లాక్ చేసుకున్నారు. అక్కినేని నాగార్జున తన చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని ముందు భావించినా సాంకేతికంగా ఎక్కువ హంగులు చెయ్యాల్సిన అవసరం ఉండటంతో రాజి పడకుండా మంచి సినిమా బైటకు పంపాలి అని, అందుకు తగిన సమయం సాంకేతిక నిపుణులకు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు.

మరి దర్శకేంద్రుడి చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి అక్కినేని నాగార్జునను సంక్రాంతి బరిలో నిలబెడతారో లేదో చూడాలి.

Similar News