వెళ్లిపోయే ముందు రాళ్లు వేయడం కరక్టేనా?

Update: 2016-10-03 07:48 GMT

తనకు ఎలాంటి చిత్రాలు చేయాలని ఉన్నదో ట్రాక్ మీద ఉన్నప్పుడే కోరికను బయటపెట్టాలి. తీరా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని , పెళ్లి రూపేణా ఇండస్ట్రీ నుంచి తప్పుకునే సమయంలో.. పరిశ్రమలోని లోపాల గురించి రాళ్లు వేసి పోవడం అంత సబబు అనిపించుకోదు. కానీ సమంత ఇప్పుడు అదే పని చేస్తోంది.

మొదటి చిత్రమే ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఏ మాయ చేశావే తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన మద్రాస్ భామ సమంత ఆ చిత్రం తర్వాత కూడా బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో విజయ పరంపర కొనసాగించింది. తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి తెలుగు తమిళ్ భాషల సినిమాలను సమన్వయించుకుంటూ వస్తుంది. కాగా తాజాగా అఆ, జనతా గ్యారేజ్ వంటి విజయాలు తన ఖాతాలో ఉన్నప్పటికీ తదుపరి చిత్రాల కార్యాచరణలో వెనుకంజలోనే ఉంది.

సమంత సినిమాలు తగ్గించటానికి అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, త్వరలో నిర్ణయం కాబోతున్న పెళ్లి ముహుర్తాలే కారణం అని, తన పెళ్లి నాటికి అన్ని చిత్ర ఒప్పందాల నుంచి విముక్తి చెందాలని సమంత యోచిస్తున్నట్టు, అందుకే కొత్త చిత్రాలు సంతకం చెయ్యలేదు అని పరిశ్రమ వర్గాలలో, ప్రేక్షకుల్లో చర్చ నడుస్తుంది. కాగా సమంత ఇవి కేవలం అపోహలే అని తన ట్విట్టర్ ద్వారా అసలు సంగతి వెల్లడించింది.

దక్షిణ భారతీయ చిత్రాలలో కథానాయికకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దొరకటం ఎంత అసంభవమో ఇప్పుడు తెలిసి వచ్చింది అని పేర్కొంది. పరిశ్రమ మీద తన అసంతృప్తి వెల్లడిస్తేనైనా దర్శక రచయితలు తనకోసం వైవిధ్య పాత్రలు సృష్టిస్తారని నమ్మకమో ఏమో కానీ సమంత మాత్రం చాలా ధైర్యమే చేసింది అని చెప్పాలి.

Similar News