వ్యాపారస్థుడినే కోరుకున్న మరో హీరోయిన్

Update: 2016-10-06 12:02 GMT

రంగుల ప్రపంచంలో అగ్ర తారల హోదా అనుభవించి, కొంత కాలానికి అవకాశాలు తగ్గు ముఖం పట్టటంతో వివాహంపై దృష్టి పెడుతుంటారు ముప్ఫైల్లో పడ్డ నాయికలు. వారిలో ఎక్కువ శాతం ప్రముఖ వ్యాపారవేత్తలను అందులోనూ ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని అన్ని భాషల్లోనూ నటించిన నిఖిత నిజ జీవితంలో ఇప్పుడు పెళ్లి కూతురిగా ముస్తాబయిపోయింది. ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఐన గగన్ దీప్ సింగ్ మాగో ని ప్రేమ వివాహం చేసుకోబోతుంది.

ఇప్పటికే వివాహం ముందు జరిగే మెహందీ కార్యక్రమం తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలో జరుపుకుంది నిఖిత. తన వివాహం గురించి నిఖిత స్పందిస్తూ "నాది ప్రేమ వివాహమే. గత ఏడాది ఒక పెళ్లి లో నేను మొదటి సారి గగన్ ని కలిసాను. అతను నా కజిన్కి స్నేహితుడు కూడా. తర్వాత మా అమ్మ అనారోగ్యం పాలై వైద్యం చేపించుకుని కోలుకుంటున్న సమయంలో మద్రాసులోని మా ఇంటికి వచ్చి పెద్దలతో చర్చించి తనే ఒప్పించాడు. ఇద్దరి అభిప్రాయాలతో పాటు, కుటుంబ నేపధ్యాలు కలవటంతో మా ప్రేమని ఒప్పించటానికి ఏ ఆటంకాలు ఎదురు కాలేదు." అని తెగ సంబర పడుతూ చెప్పింది.

తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించిన నిఖిత తెలుగు లో హాయ్, కల్యాణ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, డాన్, అనసూయ, చింతకాయల రవి, అవును 2, టెర్రర్ వంటి పలు చిత్రాలలో నటించింది.

Similar News