శ్రీనివాస్ రెడ్డి కోసం బండ్రెడ్డి సుకుమార్

Update: 2016-10-05 07:37 GMT

హాస్య నటులు ప్రధాన కథానాయకులుగా మారటం మన చలన చిత్ర పరిశ్రమలో అనాది నుంచి నడుస్తున్న సంస్కృతే. కానీ వారిలో హాస్య నటుడిగా సక్సెస్ ఐన వారు కథానాయకులుగా మాత్రం రానించటం చాలా అరుదుగా జరుగుతుంది. నాటి తరం రేలంగి నుంచి నేటి తరం ధన రాజ్ వరకు ఎందరో హాస్య నటులు ఈ కోవకు చెందినవారే. నేటి తరం కథానాయకులు స్వతహాగా కామెడీ కూడా చేసేస్తుండటంతో ప్రత్యేకంగా కమెడియన్స్ కి కథ లో ట్రాక్స్ రాయటం చాలా వరకు తగ్గింది. హాస్య నటులు కొత్త దారి తీసుకోవటానికి ఇది కూడా ఒక కారణం ఐయి ఉండొచ్చు.

నేటి తరం హాస్య నటులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన హాస్య నటుడిగా చేస్తూనే కథానాయకుడిగా మారి చేసిన ప్రయత్నం 2014 లో విడుదల ఐన గీతాంజలి. హారర్ కామెడీ కోణంలో కోన వెంకట్ కథ కథనాలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుని చిన్న సినిమాలలో ఆ ఏడాది పెద్ద సక్సెస్ గా నిలిచింది. ఆ ప్రోద్బలంతోనే కాబోలు.. శ్రీనివాస్ రెడ్డి జయ్యమ్ము నిశ్చయమ్ము రా తో మళ్లీ కథానాయకుడిగా రాబోతున్నారు. ఈ చిత్ర ప్రచారంలో చాలా శ్రద్ద చూపుతున్నారు దర్శక నిర్మాత. ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేపించారు.

ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదలను వైవిధ్య దర్శకుడు సుకుమార్ చేత చేపించటానికి రంగం సిద్ధం చేస్తుంది చిత్ర బృందం. నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావటానికి శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి సరసన పూర్ణ ఈ చిత్రంలో కనిపించనుంది.

Similar News