'సర్దార్ గురుంచి ఆసక్తికర ముచ్చట్లు ...!

Update: 2016-04-14 00:47 GMT

మొత్తానికి టాలీవుడ్‌కి సీక్వెల్స్‌ సినిమాలు, సీక్వెల్‌ టైటిల్స్‌ ఏమాత్రం కలిసి రాదని మరోసారి రుజువైంది. 'ఆర్య2, శంకర్‌దాదా జిందాబాద్‌, కిక్‌2, సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లే దీనికి ఉదాహరణ అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు, మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఈ సీక్వెల్స్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు మద్య ఉన్న సెంటిమెంట్‌ను కూడా కొందరు వెలికితీస్తున్నారు. దేవిశ్రీ పనిచేసిన 'ఆర్య2, శంకర్‌దాదా జిందాబాద్‌, సర్దార్‌గబ్బర్‌సింగ్‌' వంటి సీక్వెల్స్‌కు దేవిశ్రీనే సంగీతం అందించాడని, ఈ చిత్రాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచినప్పటికీ ఈ మూడు చిత్రాలు బాగా నిరాశపరిచిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తునారు. కాగా 'సర్దార్‌' విషయానికి వస్తే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసి, నైజాంలో వాటా తీసుకున్న ఈరోస్‌ సంస్థకు ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చిందిట. మొత్తంగా ఈ చిత్రం ద్వారా ఆ సంస్దకు 20కోట్ల వరకు నష్టం వచ్చిందని, అలాగే చిత్రాన్ని కొన్న బయ్యర్లు కూడా భారీగా నష్టపోతున్నారనేది వాస్తవం. కాగా నిర్మాత శరత్‌మరార్‌ను పిలిచి ఈ చిత్రం ద్వారా నష్టపోయిన వారికి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించమని పవన్‌ తన స్నేహితుడైన శరత్‌మరార్‌కు చెప్పాడనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరో కథనం ఏమిటంటే.. సినిమా హక్కులు తీసుకుంటున్నప్పుడే పవన్‌, శరత్‌మరార్‌లు బయ్యర్ల చేత,ఈరోస్‌ చేత తమ స్వంత రిస్క్‌తోనే కొంటున్నామని, నష్టాలు వస్తే దానికి తాము బాధ్యలం కాదని ముందుగానే అగ్రివెంట్లపై సంతకాలు చేయించుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమో కొన్ని రోజులాగితే కానీ తేలదు.

Similar News