సల్మాన్ బాటలో హీట్ పెంచేసిన ఓంపురి

Update: 2016-10-04 09:17 GMT

నిన్నగాక మొన్న సల్మాన్ ఖాన్ భరత్ చర్యలపై సంచలనం గా మాట్లాడి జనాగ్రహానికి గురైయ్యాడు. పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేస్తూ గడుపుతుంటే ... పాకిస్తాన్ కళాకారులూ, నటులు మనల్ని ఏం చేశారని వారిని ఇక్కడ ఇండియాలో బ్యాన్ చేశారని సంచలనాత్మక వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు సల్మాన్ ని ఇబ్బందుల్లో పడేశాయి. దేశ వ్యాప్తం గా సల్మాన్ ఖాన్ ని జనం తమ ఇష్టం వచ్చినట్లు తిట్టేసారు. మరంతేగా భారత సైన్యం ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ తో పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం నీచపు, కుట్రలు చేస్తూ భరత్ సైన్యాన్ని మట్టుబెడుతుంది. మారాలంటప్పుడు చిన్న పెద్ద అందరూ పాకిస్తాన్ చర్యలను తప్పుబడుతుంటే సల్మాన్ మాత్రం నటులకు ఎందుకు వెయ్యాలి శిక్ష అని మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు.

ఇక సల్మాన్ లగే మరో నటుడు కూడా ఇలాగె మాట్లాడుతున్నాడు. ఇండియాలోని ఒక ప్రముఖ ఛానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమం లో నటుడు ఓంపురి పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం పాకిస్తాన్ నటులు, కళాకారులపై భారత్ లో నిషేధం విధించడం పై జరిగింది. ఇక ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఓం పూరి యూరి ఘటన పై తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు. అసలు వీరిని(భరత్ సైన్యం) ఎవరు ఆర్మీ లో చేరమన్నారు. ఎవరు చెప్పారు వీరికి ఆయుధాలు పట్టుకోమని అంటూ సంచలనాత్మకం గా వ్యాఖ్యలు చేసాడు. ఇంకా మెం చెప్పలేదుగా మిమ్మల్ని సైన్యం లో చేరమని అంటూ వివాదాలకు తెర లేపాడు. అసలు పాకిస్తాన్ నటీ,నటులపై నిషేధం విధించేముందు వారి పాస్పోర్ట్ రద్దు చెయ్యాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇక ఓంపురి వ్యాఖ్యలపై అప్పుడే సోషల్ మీడియా వేదికగా రచ్చ, రచ్చ జరుగుతుంది.

అసలు వీరేందుకు అలా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఇలా కష్టాలు, ఇబ్బందులు, చిక్కులు తెచ్చుకుంటున్నారో. ఎంతైనా సెలబ్రిటీస్ కదా ఏమన్నా చెల్లుద్ది అనుకున్నారేమో. ఇప్పుడిక ప్రజల ఆగ్రహం చవిసూస్తే గాని తెలియదు వారెంత తప్పుగా మాట్లాడారో.

Similar News