సినిమా హిట్ అయినా హీరోయిన్ ఫేట్ మారలేదు!

Update: 2016-04-07 12:17 GMT

నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లో కీర్తి సురేష్ అడుగు పెట్టింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది శైలజగానే అయినా.. అంతకు ముందే ఓ టాలీవుడ్ సినిమాలో నటించింది కీర్తి. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ కృష్ణ హీరోగా రూపొందిన 'ఐనా ఇష్టం నువ్వు' ఈమెకు తెలుగులో వచ్చిన తొలి చిత్రం. ఇది ఇంకా రిలీజ్ కాకపోయినా.. శైలజ పాత్రతో మాత్రం మంచి గుర్తింపు సంపాదించింది. నేను.. శైలజ.. తర్వాత టాలీవుడ్‌లో కీర్తి సురేష్‌కి వరుసపెట్టి ఆఫర్స్ వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ బొద్దు భామకు ఆఫర్స్ రాలేదు. కానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో.. ఈమెను తీసుకోవాలని మొదట అనుకున్నా.. తర్వాత ఈ ఆఫర్ చేజారింది. ఇప్పుడు మాత్రం ఓ తెలుగు సినిమాకి కీర్తిని కన్ఫాం చేశారని తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్ధ్. గుంటూరు టాకీస్‌తో హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో సిద్ధు చేయనున్న సినిమాలో.. కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ మూవీలో.. హీరోయిన్ పెర్ఫామెన్స్ కీలకం కావడంతో.. కీర్తికే మొగ్గుతున్నాడట సిద్ధు కూడా.

Similar News