సుమంత్ అశ్వినే నట కిరీటి అని నమ్మిన వంశి

Update: 2016-10-06 12:37 GMT

1980 ల దశకంలో హాస్య చిత్రంగా విడుదల ఐన లేడీస్ టైలర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రం నటుడిగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కి, దర్శకుడిగా వంశి కి, రచయితగా తనికెళ్ళ భరణి కి గొప్ప గుర్తింపు తెచ్చి పెట్టింది. 80 ల దశకం లో విడుదల ఐన ఎన్నో ఆణిముత్యాలను ఇప్పటి ప్రజల అభిరుచులకు తగట్టు పునర్నిర్మించి ఎందరో దర్శక నిర్మాతలు విజయవంతం కాగా, దర్శకుడు వంశి మాత్రం లేడీస్ టైలర్ చిత్రానికి కొనసాగింపు చిత్రం అని ప్రకటించిన నాటి నుంచి ఆయన నటీ నటుల ఎంపికలో తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ని మరపించే నటుడితో ఆ పాత్ర పోషించాలి అని చూస్తున్న వంశి, యువ నటుడు రాజ్ తరుణ్ దగ్గర మొదలుకొని ఎందరో యువ హీరోలను స్క్రీన్ టెస్ట్ చేసి వెనక్కి పంపారు. ఇంత కాలానికి ఇప్పుడు ప్రముఖ నిర్మాత ఎం.స్. రాజు తనయుడు సుమంత్ అశ్విన్ చేత లేడీస్ టైలర్ కొనసాగింపు చిత్రంలో ప్రధాన పాత్ర చేపించాలని నిర్ణయానికి వచ్చారు వంశి. ఆయనకు సుమంత్ అశ్విన్ లో ఎవ్వరికి కనిపించని రాజేంద్ర ప్రసాద్ ఛాయలు ఏమి కనిపించాయి మరి....

ముగ్గురు కథానాయికలకు చోటు ఉన్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మని శర్మ సంగీతం సమకూరుస్తారు. ముగ్గురి నాయికల ఎంపిక జరిగిన వెంటనే చిత్రీకరణ ప్రారంభం జరుగుతుంది. ఈ చిత్రానికి ఫాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే పేరు ఇప్పటికే ఖరారు చేసారు. ఇప్పటి తరం ప్రేక్షకుల అభిరుచులను అందుకోవడంలో వెన్నెల్లో హాయ్ హాయ్ తో వెనుకపడ్డ వంశి కి ఈ చిత్రం ఏ మేర కీర్తి ఘడిస్తుందో చూడాలి.

Similar News