సొంతవూరిలో సెలబ్రిటీ స్టేటస్ కిక్ చూసాడు

Update: 2016-10-16 11:29 GMT

రెండున్నర దశాబ్దాల క్రితం తొలి చిత్రంతోనే పరిశ్రమని తన వైపు తిప్పుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ చిత్రమే శివ. తెలుగు సినిమా నడవడికలో అనూహ్యమైన మార్పు తీసుకు వచ్చిన చిత్రంగా నేటికీ శివ చిత్రానికి ఆ గుర్తింపు ఉంది. ఆ చిత్రం ప్రధాన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించగా, అక్కినేని నాగార్జున నటించటంతో కావాల్సిన ప్రచారం దొరికింది ఆ చిత్రానికి. అదే తరహాలో తొలి చిత్రంతో పరిశ్రమని, నూతన దర్శకులని ఆకట్టుకున్న దర్శకుడు దాసరి మారుతీ. కాకపోతే మారుతీ అతి తక్కువ వ్యయంతో, 5D కెమెరాతో నూతన నటీనటులతో ఈ రోజుల్లో చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించారు.

నేడు దగ్గుబాటి వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన మారుతి సినిమా పరిశ్రమకు సంబంధంలేని అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. మచిలీపట్టణం లో సిరి వెంకట్- కృష్ణ కిషోర్ అనే థియేటర్ పక్కన స్టిక్కరింగ్ దుకాణంలో పని చేసే రోజుల్లో థియేటర్ యజమాని పోస్టర్లు, స్టిక్కరింగ్ పనుల కి మారుతిని పిలిపించేవాడంట. ఇప్పుడు ఆ థియేటర్లు మల్టీప్లెక్స్ కాగా అల్లు అరవింద్, దిల్ రాజు, యూ.వి క్రియేషన్స్ కలిసి ఒక సంస్థగా ఏర్పడి ఆ మల్టీప్లెక్స్ లీజుకి తీసుకున్నారు.

మచిలీపట్నంలో ఆ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి అతిధిగా మారుతీ రాగా, థియేటర్ యజమాని ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయారంట. మారుతికి తన సొంత ఊరులో సెలబ్రిటీ స్థాయి హోదాలో కార్యక్రమానికి హాజరు కావటం కూడా ఇదే తొలి సారి.

Similar News