హీరోయిన్‌ల సెంటిమెంట్ హ‌ృతిక్‌పై పనిచేస్తుందా?

Update: 2016-10-13 08:23 GMT

ముకుంద చిత్రంతో దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కొత్త హీరో హీరోయిన్ లకు అవకాశం ఇచ్చారు. వారే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజ హెగ్డే. ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించలేకపోయినప్పటికీ ఇటు వరుణ్ తేజ్ కి అటు పూజ హెగ్డే కి తదుపరి అవకాశాలు వెంటనే వచ్చాయి. ఆలా పూజ హెగ్డే చేసిన రెండవ ప్రయత్నం ఒక లైలా కోసం కూడా బెడిసి కొట్టింది. కానీ అమ్మడి అదృష్టం హ్రితిక్ రోషన్ సరసన హిందీలో భారీ వ్యయంతో నిర్మించబడ్డ మోహాంజెదరో లో అవకాశం తెచ్చి పెట్టింది. అయితే ఈ చిత్రం కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది.

రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం ఐన యామి గౌతమ్, తరువాతి కాలంలో అల్లు శిరీష్ సరసన గౌరవం, తరుణ్ సరసన యుద్ధం, నితిన్ సరసన కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాలలో నటించింది. కాగా ఈ చిత్రాలు ఏవీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు యామి గౌతమ్ కూడా హిందీలో హ్రితిక్ రోషన్ సరసన నటించే అవకాశం సంపాదించుకుంది. హ్రితిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాణంలో సంజయ్ గుప్తా కాబిల్ అనే చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

మరి నాగ చైతన్య హీరోయిన్ ఇక్కడిలానే బాలీవుడ్లోనూ హీరోలకు కలిసిరాలేదు. మరి ఇప్పుడు నితిన్ హీరోయిన్ ఐనా హ్రితిక్ కి కలిసి వస్తుందో లేదో చూడాలి. హ్రితిక్ కి కూడా చాలా కాలం గ సరైన విజయం అంధక సతమతమవుతున్నాడు. అందువల్ల కాబిల్ చిత్ర విజయం అందరికి కీలకం కానుంది.

Similar News