Dhanush Raayan Review: రాయన్ సినిమా రివ్యూ
సినిమాకు దర్శకుడు కూడా ధనుష్ కావడంతో
తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ నటులలో ధనుష్ ఒకరు. రఘువరన్ బీటెక్ సినిమా నుండి ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ మొదలైంది. ఇక సార్ సినిమా భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక అతడు హీరోగా నటించిన 'రాయన్' సినిమా థియేటర్లలో విడుదలైంది.
కథ:
రాయన్ (ధనుష్) అని తల్లిదండ్రులు పట్టణానికి వెళ్లి తిరిగి రారు. అతడితో పాటూ ఇంకో ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి అతడి దగ్గరే ఉంటారు. సొంత ఊరిలో ఉండలేక రాయన్ తన తమ్ముళ్లు, చెల్లెలితో కలిసి టౌన్ కు వచ్చేస్తారు. తన కుటుంబం జోలికి వస్తే ఏదైనా చేసే సత్తా ఉన్న వ్యక్తి రాయన్.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా సైలెంట్ గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ ఊర్లో ఉండే రెండు గ్యాంగ్ ల కారణంగా రాయన్ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటప్పుడు రాయన్, అతడి కుటుంబాన్ని ఆ గ్యాంగ్ లు ఏమి చేశాయి.. రాయన్ ఆ గ్యాంగ్ లను ఏమి చేశాడో తెలియాలంటే సినిమా చూడాలి.
కథనం:
ముందు నుండి మనం చూసిన రొటీన్ సినిమా తరహాల్లోనే ఈ సినిమా కూడా సాగుతుంది. రాయన్ కు అతడి కుటుంబ సభ్యులు సమస్యల్లో ఇరుక్కోవడం అసలు నచ్చదు.. అలాగని చూస్తూ ఉండే రకం కూడా కాదు. అలాగని ఆ సమస్యను పూర్తిగా లేకుండా చేస్తాడా అంటే అదీ కూడా ఉండదు. ఇది కాస్త మనకు తేడా కొట్టినట్లుగా అనిపించవచ్చు.
సినిమాకు దర్శకుడు కూడా ధనుష్ కావడంతో అటు నటన-ఇటు డైరెక్షన్ విషయంలో పర్వాలేదనే మార్కులే పడతాయి. ఇదే సీన్ ఇంకో డైరెక్టర్ అయినా ఇంకా ఇంపాక్ట్ తో తీసి ఉండేవాడు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోతుంది.. ఇక సెకండాఫ్ లో ఒకే చోట కథ నిలిచిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమి చేస్తాడో.. ఎలా చేస్తాడో చూడాలని మాత్రం అనిపిస్తూ ఉంటుంది.
తక్కువ డైలాగ్‌స్ తో, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా కుదిరాయి. రెహమాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.. సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ మంచి కెమెరా పనితనంతో, సినిమా మొదటి సగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్స్ భావోద్వేగాలు హృదయాన్ని తాకడంలో మాత్రం విఫలమైంది. సొంత వాళ్లే ద్రోహం చేస్తే వచ్చే ఫీల్ వేరే ఉంటుంది.. సినిమాను చూసే సమయంలో హీరో మనమే అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే సీట్ లో కూర్చుంటారు. మనకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎలా అనిపిస్తుందో.. అచ్చం అలాగే క్యారెక్టర్ ను చూసినప్పుడు కూడా అనిపించాలి ఇలాంటి సీన్స్ లో!! కానీ అదంతా మిస్ అయిపోవడంతో సెకండాఫ్ కాస్త యావరేజ్ గానే అనిపిస్తుంది.
మిగిలిన వాళ్లు:
ధనుష్ సోదరుడిగా సందీప్ కిషన్ పాత్ర చాలా బాగుంది. మంచి పాత్రను పోషించాడు. ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య బాగా చేశారు. ఎస్జే సూర్య ఎప్పటిలాగే బాగా చేశారు.
ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే సాంగ్ కూడా మంచి ఊపు తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. ధనుష్ డైరెక్టర్ గా పర్వాలేదనిపించినా.. స్క్రిప్ట్ రైటింగ్ మాత్రం అంత ప్రభావవంతంగా లేదు.
సినిమా ఎలా ఉందంటే: ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించినా.. సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కాకపోయినా.. యావరేజ్ సినిమాగా నిలిచింది.
రేటింగ్: 2.75/5