నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి.. లావుగా ఉంటే పెళ్లి కాదా.? రోహిణి సీరియస్‌

నటి రోహిణి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి..

Update: 2024-07-13 13:23 GMT

Rohini

నటి రోహిణి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాలో తాజాగా వీడియో షేర్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

'బర్త్‌డే బాయ్‌' ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్‌ పార్టీ థీమ్‌తో ఒక ప్రాంక్‌ వీడియ చేశా. సోషల్‌ మీడియాలో అది చాలా వైరల్‌ అయ్యింద. ఇది కేవలం ప్రమోషన్‌ మాత్రమేనని, నిజమైన రేవ్‌ పార్టీ కాదని చాలా మందికి అర్థమైంది. అయితే ఆ వీడియోపై ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశా. ఏమైనా సంఘటన గురించి మాట్లాడితే అది నిజమా..? కాదా? అని తెలుసుకుని మాట్లాడాలని రోహిని అన్నారు. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్‌ చేయకూడదు. నేను మందు తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా? వ్యక్తిగతంగాను కామెంట్స్‌ చేశారు.


లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా?

మరో మాట.. తాను లావుగా ఉన్నా పెళ్లి చేసుకోవడం లేదని కామెంట్‌ చేయడం సరికాదన్నారు రోహిణి. సర్జరీ కారణంగా నేను లావయ్యానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే సదరు జర్నలిస్టులంటే నిజానిజాలను తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేవారని ఆమె అన్నారు. ఏమీ తెలుసుకోకుండా వచ్చి ఇలా ఇంటర్వ్యూల్లో కూర్చొనేవాళ్లు కాదు. మీరెలా సీనియర్‌ జర్నలిస్ట్‌ అయ్యారో అర్థంకావడం లేదు. మీకు ఏమీ వర్క్‌ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఇలా ఊరికే మాట్లాడకండి. మీరు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే నా సమాధానం మరోలా ఉండేది’’ అంటూ ఆమె సీరియస్‌ అయ్యారు.

కాగా, రోహిణి ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ‘సేవ్‌ ది టైగర్స్‌’ సిరీస్‌ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రవికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ద బర్త్‌డే బాయ్‌’. విస్కి దర్శకుడు. ఐ.భరత్‌ నిర్మాత. జూలై 19వ తేదీన విడుదల కానుంది.

Tags:    

Similar News