రంగబలి సినిమా రివ్యూ

సొంత ఊరే ప్రపంచం అని అనుకునే వ్యక్తి శౌర్య. సొంత ఊర్లోనే తన బలం ఉందని భావిస్తూ ఉంటాడు. అతడి తండ్రి మెడికల్ షాప్ ఓనర్..

Update: 2023-07-07 09:22 GMT

విడుదల తేదీ : జూలై 07, 2023

నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, షైన్ టామ్ చాకో, సత్య, బ్రహ్మాజీ, రాజ్‌కుమార్ కసిరెడ్డి
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: పవన్ సిహెచ్
సినిమాటోగ్రాఫర్: దివాకర్ మణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
కథ: సొంత ఊరే ప్రపంచం అని అనుకునే వ్యక్తి శౌర్య. సొంత ఊర్లోనే తన బలం ఉందని భావిస్తూ ఉంటాడు. అతడి తండ్రి మెడికల్ షాప్ ఓనర్.. అల్లరి చిల్లరగా గొడవలు పడుతూ ఊర్లో తిరుగుతూ ఉంటాడు శౌర్య. సొంత ఊర్లో సెటిల్ అవ్వాలంటే ఆ మెడికల్ స్టోర్ బాధ్యతలు చూసుకోవాలి కాబట్టి.. కొన్ని నెలల పాటూ ఊరు దాటడానికి ఒప్పుకుంటాడు. అలా వచ్చిన శౌర్య.. సహజ(యుక్తి తరేజా) ను ప్రేమిస్తాడు. ఆమె అతడి ప్రేమను ఒప్పుకుంటుంది. కానీ ఆమె తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోడు.. అందుకు కారణం ఏమిటి? సొంత ఊర్లో ఉన్న సమస్యలు ఏమిటి? రంగబలి అని సినిమాకు ఎందుకు పెట్టారు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే:
మన ఊర్లలో జరిగే గొడవలాగా సినిమా అనిపిస్తుంది. కథ నేటివిటీకి దగ్గరగా ఉన్నట్లు ఫస్ట్ హాఫ్ లో అనిపించినా.. సెకండాఫ్ సమయానికి రొటీన్ సినిమా లాగా అనిపిస్తుంది. అయితే చివర్లో చిన్న మెసేజ్ కూడా బాగుంది కానీ.. క్లైమాక్స్ కామెడీ అంతగా పండలేదు. సొంత ఊరితో అనుబంధం ఉన్న వ్యక్తిగా బాగా చేశాడు. అవసరమైన చోట హీరోయిజం చూపిస్తూ.. మిగిలిన చోట తన మీద పంచ్ లు వేయించుకుంటూ సరదాగా సాగిపోయే యువకుడి జీవితాన్ని ఇందులో చూపించారు. శౌర్య కామెడీ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు. కమెడియన్ సత్య తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కామెడీ టైమింగ్స్, ఎక్స్‌ప్రెషన్స్, ఫన్నీ డైలాగ్‌లతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని బాగా చూపించారు. దర్శకుడు ప్రథమార్థాన్ని ఫుల్ కామెడీతో ఎనర్జిటిక్ ఎలిమెంట్స్ తో నింపేశాడు.

ఎక్కడ తప్పు జరిగింది:
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీగా సాగిపోతుంది. కానీ సెకండాఫ్ స్టోరీలోకి వెళ్తే గొప్పగా అనిపించదు. ప్రేక్షకులను కట్టిపడేసే ఎలెమెంట్స్ కూడా పెద్దగా లేవు. శౌర్య, అతని స్నేహితులు, కాలేజీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్‌ని చక్కగా హ్యాండిల్ చేయగా, సెకండ్ హాఫ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పేలవమైన రైటింగ్ కారణంగా సెకండాఫ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. బలహీనమైన స్క్రీన్‌ప్లే, గొప్పగా అనిపించని ప్రీ క్లైమాక్స్ కాస్త నిరాశనే మిగిలిస్తుంది. ఇక విలన్ కు హీరోకు మధ్య సీన్లు గొప్పగా అనిపించవు.
మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కు తగిన స్క్రీన్ టైమ్ లేని క్యారెక్టర్‌లో కనిపించాడు. మురళీ శర్మ, శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించినప్పటికీ, వారిని సమర్థవంతంగా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కమెడియన్ సత్య చాలా తక్కువగా తెరపై కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌ నుంచి సెకండాఫ్‌లో పెద్ద నిరాశే ఎదురవుతుంది.
ప్లస్ పాయింట్స్:
నాగ శౌర్య
సత్య
ఫస్ట్ హాఫ్ కామెడీ

మైనస్ పాయింట్లు:
సెకండాఫ్
క్లైమాక్స్

రేటింగ్: 2.5/5


Tags:    

Similar News