జవాన్ సినిమా రివ్యూ

పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు

Update: 2023-09-07 05:55 GMT

పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు వచ్చాడు. తమిళ డైరెక్టర్ అట్లీతో జతకట్టాడు షారుఖ్ ఖాన్. జవాన్‌లో డ్రామా, భావోద్వేగాలు, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాస్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే జవాన్ ఫీవర్‌లో మునిగిపోయింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్‌లు జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. అట్లీ స్టైల్‌లో భారీ ఎంటర్‌టైనర్ థియేటర్లలో ల్యాండ్ అయింది.

కథ:
సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికి విక్రమ్ రాథోడ్ ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబై లో మెట్రో ట్రైన్ ను హైజాక్ చేస్తాడు. ఆ తర్వాత అతడిని పట్టుకోడానికి నర్మద(నయనతార) పోలీసు ఆఫీసర్ ప్రయత్నిస్తుంది. విక్రమ్ రాథోడ్ టార్గెట్ కాళీ(విజయ్ సేతుపతి) సామ్రాజ్యాన్ని నాశనం చేయడం. అలా టార్గెట్ చేస్తున్న సమయంలో విక్రమ్ రాథోడ్ కు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఇంతకూ ఆ విక్రమ్ రాధోడ్ ముఖం వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉంది:
షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మొదటి హిందీ వెంచర్‌లో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాదిన తండ్రీ కొడుకు కలిసి శత్రువులను అంతం చేసే సినిమాలు చాలానే వచ్చాయి. 1990ల నాటి యాక్షన్ బ్లాక్‌బస్టర్‌ల తరహాలో ఈ సినిమా సాగుతుంది. అయితే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. అటు భావోద్వేగాలతో.. ఇటు యాక్షన్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. జవాన్ కథ పాతదైనా.. షారుఖ్ ఖాన్ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. నయనతార తమిళ 'బిల్లా'లో కనిపించినట్లే చెక్కు చెదరని గ్లామర్, యాక్షన్ తో అలరించింది. ఇక విజయ్ సేతుపతి విలన్ గా అద్భుతంగా చేశాడు. కొన్ని సీన్లలో విలన్ గానూ కామెడీ పండించాడు.
కింగ్ ఖాన్ గర్ల్ గ్యాంగ్‌ సినిమాకు చాలా ప్లస్ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, సన్యా మల్హోత్రా, రిద్ధి డోగ్రా, ప్రియమణి, దీపికా పదుకొనే సినిమాలో అలరించారు. సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అనిరుధ్ ఇచ్చిన సంగీతం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటూ.. పాటలు కూడా సూపర్ ఉన్నాయి. సినిమాలో రిచ్ నెస్ కనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎడిటింగ్ చేశారు. అనవసర సన్నివేశాలు అతి తక్కువ.
భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. షారుఖ్ ఖాన్ కెరీర్ లో వచ్చిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిలుస్తుంది. మంచి మెసేజీ ఉన్న సినిమా కూడా..!

ప్లస్ పాయింట్లు:
షారుఖ్ ఖాన్
ఇంటర్వెల్
సంగీతం
యాక్షన్ సీన్స్
విజయ్ సేతుపతి

మైనస్ పాయింట్లు:
రొటీన్ స్టోరీ
రేటింగ్: 3.5/5


Tags:    

Similar News