జైలర్ సినిమా రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ అంటే అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదల అంటే

Update: 2023-08-10 10:05 GMT

విడుదల తేదీ : ఆగస్టు 10, 2023

నటీనటులు: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, రమ్య కృష్ణ, తమన్నా భాటియా, సునీల్, వినాయకన్, మర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు
దర్శకుడు: నెల్సన్ దిలీప్‌కుమార్
నిర్మాతలు: కళానిధి మారన్
సంగీత దర్శకులు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్: విజయ్ కార్తీక్ కన్నన్
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ అంటే అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదల అంటే ఆఫీసులకు, స్కూల్స్ కు, కాలేజీలకు హాలిడేస్ ఉంటాయి. ఒకవేళ ఉన్నా మాస్ బంకు తప్పనిసరి. తాజాగా రజనీకాంత్ నుండి వచ్చిన జైలర్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ డాక్టర్,బీస్ట్ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహించారు. భారీ తారాగణం ఉన్న సినిమా. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటలకు భారీగా రెస్పాన్స్ రావడంతో ఈరోజు థియేటర్ల దగ్గర తెలుగు స్ట్రైట్ సినిమా సందడి కనిపించింది.
కథ:
ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్), తన కుటుంబంతో సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండే రిటైర్డ్ జైలర్. ముత్తు కొడుకు అర్జున్ (వసంత్ రవి) పోలీస్ ఆఫీసర్. పురాతన వస్తువులు, దేవుడి విగ్రహాలను స్మగ్లింగ్ చేసే వర్మ (వినకాయన్)తో గొడవ మొదలవుతుంది. ఒక రోజు అర్జున్ కనిపించకుండా పోతాడు.. ఒక పోలీసు తప్పిపోయాడని పోలీసులు బయటకు చెప్పరు.. అయితే చనిపోయాడని మాత్రం ఓ మహిళా పోలీసు ముత్తుకు చెబుతుంది. దీంతో ముత్తు రివెంజ్ మొదలవుతుంది. ముత్తు రివెంజ్ తీసుకున్నాడా లేదా.. లేక తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా.. అతడి జర్నీలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్లు:
చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆయన ఎలాంటి పాత్ర చేస్తే చూస్తామో.. అలాంటి పాత్రలో కనిపించి మెప్పించారు. ఆయన క్యారెక్టరైజేషన్ ని నెల్సన్ బాగా డిజైన్ చేశాడు. మొదటి సగంలో రజనీకాంత్ ను చూపించిన విధానం.. ఆ తర్వాత ఆయనలో వచ్చే వేరియేషన్స్ చాలా చాలా బాగుంటుంది. అలా ఎదుగుతూ ఫుల్ మాస్ లోకి వచ్చి.. ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా ఉంది.
జైలర్‌లో రజనీకాంత్ కామెడీ టైమింగ్ ను కూడా బాగా వాడుకున్నారు. ముఖ్యంగా యోగి బాబుతో సన్నివేశాలు బాగా నవ్వించాయి. డార్క్ కామెడీ మొదటి గంటలో చాలా బాగా పనిచేసింది. రజనీకాంత్ తర్వాత సినిమాకి అనిరుధ్‌ ప్రాణం పెట్టాడు. అతను తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సూపర్‌స్టార్‌ని అద్భుతమైన రీతిలో ఎలివేట్ చేశాడు. హుకుం సాంగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్భుతంగా అనిపించాయి. రమ్యకృష్ణ, మర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి తమ తమ పాత్రల్లో నటించారు. రమ్య కృష్ణ పాత్రను ఇంకొంచెం వాడుకుని ఉండి ఉంటే చాలా బాగున్ను అని అనిపిస్తుంది.
మిగిలిన అంశాలు:
జైలర్ సినిమా ఆఖరికి వచ్చే సరికి సగటు ఆడియన్స్ గెస్ చేయగలుగుతారు. అందుకే సెకండాఫ్ ఫస్ట్ హాఫ్ రేంజిలో అనిపించదు. కానీ డార్క్ హ్యూమర్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అదే ఊపును క్యారీ చేయడంలో విఫలమైంది. సినిమా సెకండాఫ్ లో కొన్ని కామెడీ ట్రాక్‌లను ఆశ్రయించాడు కానీ అనుకున్నంత పేలలేదు. సునీల్ క్యారెక్టరైజేషన్, తమన్నాకు కథలో పెద్ద విలువ ఇవ్వలేదు. కథ బలహీనంగా ఉన్నందున, యాక్షన్ బ్లాక్‌లు అనుకున్నంత పేలలేదు. ట్విస్ట్ కూడా అంత గొప్పగా అనిపించదు. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ అతిధి పాత్రలు ఆయా లొకాలిటీలో బాగా పేలుతాయి.. తెలుగు వాళ్లకు అంతగా ఎక్కకపోవచ్చు. 
సాంకేతికంగా చూసుకుంటే అనిరుధ్ అద్భుతంగా సంగీతం అందించాడు. కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడింది. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ టీం సెకండాఫ్‌లో కొన్ని సీక్వెన్స్‌లను కత్తిరించి ఉండాల్సింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీని చాలా బాగా చూపించాడు.. కానీ అతని స్క్రిప్ట్‌ మరీ గొప్పగా లేదు. ఫస్ట్ హాఫ్ ని చక్కగా హ్యాండిల్ చేశాడు కానీ సెకండ్ హాఫ్ ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది.
రేటింగ్: 2.75/5


Tags:    

Similar News