ఏడు రాజ్యసభ స్థానాలకు ఎవరో?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏడు స్థానాలను అధికారపార్టీ ఖాతాలోనే పడనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏడు స్థానాలను అధికారపార్టీ ఖాతాలోనే పడనున్నాయి. జూన్ నాటికి ఈ స్థానాలు ఖాళీ కానుండటంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు మూడు బీజేపీవి, ఒకటి వైసీపీ ఉన్నాయి. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేష్ ప్రభు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పదవీ కాలం కూడా పూర్తి కానుంది.
ఆశావహులు....
ఇక తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ ల పదవీకాలం జూన్ నెలతో ముగియనుంది. అదే సమయంలో బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో దీనిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ అధినేతలు ఎవరి పేర్లను ఖరారు చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.