Telangana Elections : కామ్రేడ్లకు కాంగ్రెస్ ఆఫర్.. కానీ?

సీపీఐ, సీపీఎంల పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Update: 2023-10-30 05:26 GMT

సీపీఐ,సీపీఎంల పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం, సీపీఎంకు మిర్యాలగూడ స్థానాలను కేటాయించే అవకాశముంది. సీపీఎంకు మిర్యాలగూడతో పాటు మలక్ పేట్, సీపీఐకి కొత్తగూడెంతో పాటు కార్వాన్ నియోజకవర్గం కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు వామపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు స్థానాలకు అంగీకరించాలని సీపీఎం, సీపీఐలను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

ఎమ్మెల్సీ స్థానంతో....
అయితే ఒక అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంటే అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్లకు ఆఫర్ ఇచ్చింది. కానీ ఇందుకు కమ్యునిస్టు పార్టీలు మాత్రం అంగీకరించడం లేదు. తాము బలంగా ఉన్న చోట్ల సీట్లు కేటాయించకపోతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధమవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన డెడ్ లైన్ కూడా విధించారు. తేల్చుకోవడం వారి చేతుల్లోనే ఉందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.


Tags:    

Similar News