Telangana Elections : నేడు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
నేడు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని విరమించే ప్రయత్నం చేస్తున్నారు
నేడు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని విరమించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు మొత్తం పదమూడు చోట్ల రెబల్స్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ పదమూడు నియోజకవర్గాల్లో ప్రధాన నేతలే ఎన్నికల బరిలో ఉండటంతో వారిని విరమించేందుకు అగ్రనాయకత్వం బుజ్జగింపులు చేపట్టింది. అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని చెబుతుంది. రాహుల్ గాంధీ పర్యటనలో ఈ హామీలు మీకిస్తామని చెబుతుంది.
బుజ్జగింపులు...
అలాగే బీఆర్ఎస్ కు రెబల్స్ అభ్యర్థులు పెద్దగా లేరు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక మంది నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు రంగంలోకి దిగి నామినేషన్లను ఉపసంహరించుకుంటే డిమాండ్లను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే 28 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా ఎనభై మంది వరకూ బరిలో ఉన్నారు. దీంతో ఆఖరి ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుంది.