Telangana Politics: ఆ ఇద్దరి చుట్టే తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కిపోతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల

Update: 2023-11-11 02:52 GMT

తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కిపోతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలకు దిగుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, పంచ్‌ డైలాగులతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికలన్నీ ఆ ఇద్దరి చుట్టే తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గా ఈ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తీరా నామినేషన్ల వ్యవహారంలో కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. గజ్వేల్, కొడంగల్ ఈ రెండు నియోజకవర్గాలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. నామినేషన్ల సమయం ముగిసింది. ఇక ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3500 వరకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి నామినేషన్లు దాఖలు అయినట్లు సమాచారం.

అయితే సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం అతి ఎక్కువగా 96 నామినేషన్లతో మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో అతి తక్కువ 12 నామినేషన్లతో జాబితా నామినేషన్ల నియోజకవర్గం గా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నిలిచింది. ఇలా నామినేషన్ల వ్యవహారంలో కూడా మళ్లీ ఆ ఇద్దరి ఆగ్రనేతల నియోజకవర్గాలే ఆసక్తిగా కనిపిస్తున్నాయి. గజ్వేల్లో చిన్నాచితకా పార్టీలు, భారీ సంఖ్యలో ఇండిపెండెంట్ లు నామినేషన్లు వేశారు. అయితే గులాబీ నేత కేసీఆర్‌తో పోటీ పడ్డాం అని చెప్పుకునేందుకు భారీగానే నామిషన్లు వేశారు. అయితే ఇక కొడంగల్ విషయానికొస్తే మొదటి నుంచి కొంత వెనుకబడి ఉన్న ప్రాంతం. ఇక్కడ సాధారణంగా రాజకీయ చైతన్యం తక్కువగా ఉంటుంది. 2018 లో కూడా ఇక్కడ పదిలోపే నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఆ ఇద్దరి మధ్య మాటల యుద్దాలు..

ప్రచారాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. తానేమి తగ్గేది లే అన్నట్లు రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌పై ఆదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తన నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి చెల్లనిపైసా అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఇతర నేతలు విమర్శలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో భూములను అక్రమించేందుకు పోటీ చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సభలో కూడా కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తోంది బీఆర్‌ఎస్. అదే విధంగా కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. అటు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ల మధ్య మాటల యుద్ధాలు, పంచ్‌ డైలాగులతో దద్దరిల్లిపోతుంది.

Tags:    

Similar News