కోరుట్లలో నలుగురు పోటా పోటీ 

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్ లో ఉన్నారు

Update: 2023-11-23 13:29 GMT


ముగ్గురికి ముచ్చెమటలు పట్టిస్తున్న గల్ఫ్ అభ్యర్థి
ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారో
కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్ లో ఉన్నారు.
కోరుట్లలో 2 లక్షల 36 వేల ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగిస్తారు అనుకుంటే 1 లక్షా 77 వేల ఓట్లు పోల్ అవుతాయని అంచనా. నవంబర్ 23 నాటిక ఒక శాంపిల్ సర్వే ప్రకారం అభ్యర్థుల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు 26 శాతం (46,020), బీఆర్ఎస్ అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ 24 శాతం (42,480), బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 23 శాతం (40,710), గల్ఫ్ సంఘాల అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు 17 శాతం (39,090), బీఎస్పీ తో సహా ఇతరులకు 10 శాతం (17,700) ఓట్లు సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఎవరు ఎవరిని ఓవర్ టేక్ చేస్తారో... ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్, రాజకీయాలు, సినిమాలలో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజు రోజుకు జరిగే రాజకీయ పరిణామాలతో అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది.




(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)00

Tags:    

Similar News