BJP : నేడు మూడు సభల్లో జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు;

Update: 2023-11-19 03:55 GMT
jp nadda, bjp,  election campaign, telangana
  • whatsapp icon

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం మూడు సభల్లో నడ్డా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నిన్న నే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి గద్వాల్, నల్లగొండ, వరంగల్ లో పర్యటించి వెళ్లారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టోను కూడా విడుదల చేశారు.

మ్యానిఫేస్టోను...
ఈరోజు జేపీ నడ్డా చేవెళ్ల, నారాయణపేట్ సభల్లో పాల్గొంటారు. అనంతరం మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మ్యానిఫేస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆయన ప్రచార సభలు సాగనున్నాయి. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఈసారి ఎన్నికలకు బీజేపీ వెళ్లనుంది.


Tags:    

Similar News