బీ ఫారంలతో పాటు నలభై లక్షలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 51 మంది అభ్యర్థులకు బీఫారంలు అందచేశారు. బీఫారంలతో పాటు నలభై లక్షల రూపాయల చెక్కును అందించారు

Update: 2023-10-15 08:04 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 51 మంది అభ్యర్థులకు బీఫారంలు అందచేశారు. వారికి బీఫారంలతో పాటు నలభై లక్షల రూపాయల చెక్కును అందించారు. ఎన్నికల వ్యయం కోసం ఈ చెక్కులను కేసీఆర్ అధికారికంగా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ తరుపున అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేసేందుకు ఈ నలభై లక్షలు చెల్లించారని చెబుతున్నారు. ఎన్నికల వ్యయ పరిమితి నలభై లక్షలు మాత్రమే కావడంతో పార్టీ తరుపున ఆయన ఈ ఎన్నికల వ్యయాన్ని కూడా అందచేశారు. మిగిలిన వారు రేపు ప్రగతి భవన్ కు వచ్చి బీఫారంలు కలెక్ట్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

అచ్చొచ్చెన అంకె...
మంత్రి ప్రశాంతి రెడ్డి తరుపున కల్వకుంట్ల కవిత బీ ఫారం అందుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ బీఫారం అందుకున్నారు. యాభై ఒక్క మందికి మాత్రమే బీఫారాలు అందచేశారు. మిగిలిన వారికి రేపు అందచేస్తామని తెలిపారు. ఈరోజు మంచి రోజు కావడం, ఆయనకు ఆరు అంకె అచ్చి వస్తుందని భావించి యాభై ఒక్క మందికి మాత్రమే ఈరోజు బీఫారంలు అందచేశారు. అయితే బీఫారంలు అందని అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ మొదలయింది. చివరి నిమిషంలో పేర్లు ఏవైనా మారతాయా? అన్న ఉత్కంఠ నేతల్లో నెలకొంది. మరికాసేపట్లో ఆయన ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News