KTR : కేసీఆర్ భరోసా కింద పదిహేను గ్యారంటీలు
కాంగ్రెస్ అంటే అంధకారం, కరెంటు కోతలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అంటే అంధకారం, కరెంటు కోతలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎల్.బి నగర్ నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ అక్కడ ముచ్చటలు చెప్పిపోయాడన్నారు. ఐదు గంటలు కష్టపడి కరెంటు ఇస్తున్నామని చెప్పి వెళ్లారన్నారు. అక్కడ అంతా కరెంట్ కోతలేనట. అందుకే కాంగ్రెస్ కు అవకాశమిస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు నిరంతరాయంగా కరెంటు వస్తుందని, కాంగ్రెస్ కి ఓటేసి దానిని పాడు చేసుకోవద్దని పిలుపు నిచ్చారు.
నిర్లక్ష్యం చేయొద్దు...
కేసీఆర్ భరోసా కింద పదిహేను గ్యారంటీలను ఇస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తిరిగినట్లు ఇప్పుడు ప్రచారం నిర్వహించాలని ఆయన అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తాము పరిష్కరిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తామని తెలిపారు. స్టేబుల్ గవర్న్‌మెంట్, ఏబుల్ లీడర్ షిప్ అవసరమని ఆయన అన్నారు. ఈసారి కూడా సుధీర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.