గుర్తు కూడా ...
దానికి గుర్తు కూడా కలసి వచ్చే అంశంగా చూడాలి. ఐదు విడతలుగా 119 నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు అక్కడ ఆయనకు పాజిటివ్ వేవ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీస్ అధికారి. 1995 ఐపీఎస్ అధికారి. ఐపీఎస్ అధికారిగా పేరుపొందిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాక గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీ తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలోపేతం అయిందంటున్నారు.
గెలుపునకు అవకాశాలు...
సిర్పూర్ నియోజకవర్గంలో ఆయన పోటీకి దిగడంతో అక్కడ పార్టీ గెలవడం ఖాయమంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప ఉన్నారు. రెండుసార్లు వరసగా గెలిచిన కోనేరు కోనప్ప హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో కోనేరు కోనప్ప కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయి బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచే పోట చేస్తున్నారు. అంటే ఇక్కడ బీఎస్పీ విజయం సాధిస్తుందనడానికి 2014 ఎన్నికలే ఉదాహరణ. అందుకే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ ను ఎంచుకున్నారు. గిరిజన ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఏనుగు గుర్తంటే ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేకపోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.
నిజాయితీ పరుడైన...
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీతి నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. అందులోనూ ఆయనను బీఎస్పీ నుంచి గెలిపిస్తే పార్టీ మారరన్న విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. ఆయనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో పాటు పార్టీలోనే ఉండి సమస్యల కోసం కృషి చేస్తారన్న నమ్మిక ప్రజల్లో ఉంది. అంతేకాదు ఆయనలో ఉన్న ప్రశ్నించే తత్వం కూడా తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. కోనేరు కోనప్ప ఇప్పటికే పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉండటం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఖాకీ డ్రస్ ను వదిలి ఖద్దరు దుస్తులు వేసుకున్న ప్రవీణ్ కుమార్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు వినపడుతున్నాయి.
మాయావతి పర్యటనతో...
అంతేకాదు తెలంగాణలో డబుల్ డిజిట్ లో తమ పార్టీ అభ్యర్థులు గెలవపోతున్నారన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఇక్కడ బీఎస్పీ కీలకంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదన్న కామెంట్స్ బాగానే వినపడుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణలో ఎన్నికల ప్రచారం కూడా కలసి వచ్చే అంశంగానే చూడాలి. మాయావతి సభలకు జనం పోటెత్తడంతో అభ్యర్థుల్లో తెలియని ఉత్సాహం కనపడుతుంది. ఈసారి తెలంగాణలో నీలిరంగు జెండా ఎగరడం ఖాయమని, సిర్పూర్ లో ఖచ్చితంగా బీఎస్పీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. అనేక నియోజకవర్గాల్లో బలమైన నేతలను బరిలోకి దించడంతో బీఎస్పీని ఈ ఎన్నికల్లో తక్కువ చేసి చూడటానికి వీలులేదు.