కేసీఆర్ ఓటమి ఖాయం.. రాసిపెట్టుకోండి : రాహుల్

కేసీఆర్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయనక కాటారంలో మాట్లాడారు

Update: 2023-10-19 06:32 GMT

కేసీఆర్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయనక కాటారంలో మాట్లాడారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని రాహుల్ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు తెరదించాలని ఆయన పిలుపు నిచ్చారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించారని ఆయన ఆరోపించారు.

కుటుంబ పాలనకు...
కుటుంబ పాలనకు ఇకనైనా స్వస్తి పలికాలని ఆయన పిలుపు నిచ్చారు. బీజేపీ విపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. కానీ కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టకపోవడానికి కారణమేంటో మీకు తెలిసే ఉంటుందన్నారు. ఈ ముఖ్యమంత్రిపై ఎలాంటి ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగవని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు పార్టీలూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయని రాహుల్ ధ్వజమెత్తారు.
ఆ మూడూ ఒక్కటే...
తనపై బీజేపీ 24కేసులు పెట్టిందన్నారు. కానీ కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని రాహుల్ అన్నారు. బీజేపీ, కేసీఆర్ కలసి పనిచేస్తున్నారని అన్నారు. ఎంఐఎంతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం కుదిరిందని తెలిపారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News