తీవ్రస్థాయిలో విమర్శలు...
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ ను ధీటుగానే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంటు వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం అసలు ఉచిత విద్యుత్తు అమలు చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే.. కారు పోవాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ కాంగ్రెస్ నినాదంగా మార్చుకుంది. అంతేకాదు. ధరణి నుంచి ఉద్యోగ నియామకాల వరకూ... డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి వాటిపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యాడ్స్ రూపొందించింది. కారు పంక్చర్ అయినట్లు ఈ యాడ్ లో చూపించారు.
విజువల్ మీడియా...
అయితే ఈ యాడ్ కొంత ప్రజల్లోకి వెళుతుంది. గులాబీ పార్టీని పోలీన నేతలను వీడియోలు చూపిస్తూ జనం నిలదీసే విధానాన్ని చూపించడంతో త్వరగా ప్రజల మైండ్ లోకి ఎక్కుతుందని భావిస్తుంది. అదే సమయంలో యువత, మహిళలను ఆకట్టుకునే విధంగా ఈ యాడ్ ను రూపొందించి విజువల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. ఇది జనంలో ఎంతవరకూ కనెక్ట్ అవుతుందన్నది పక్కన పెడితే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతికూలత పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. అది ఎంత మేరకు అన్నది మాత్రం అంచనా వేయలేకపోయినా ఈ యాడ్ కొత్త తరహాలో రూపొందించి హస్తం పార్టీ నెగిటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
ఆరు గ్యారంటీలతో పాటు...
మరోవైపు తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలోనూ యాడ్స్ విజువల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈసారి అధికార బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కొంత విజువల్ మీడియాలో ప్రచారంలో అగ్రభాగంలో ఉందనుకోవాలి. ఇంకా ఎన్నికలకు ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఇరవై రోజుల్లో మరిన్ని యాడ్స్ కేసీఆర్ ను ఆయన పాలనను టార్గెట్ చేస్తూ వస్తాయంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయని వాటి గురించి వివరిస్తూ ప్రత్యేకంగా కారును రూపొందించి నియోజకవర్గాల్లో తిప్పాలని కాంగ్రెస్ నేతలు భావించినా శాంతిభద్రతల సమస్య దృష్ట్యా పోలీసులు దానికి అడ్డుకట్ట వేశారు. మరి విజువల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ యాడ్ లు హల్ చల్ చేస్తున్నాయి. మరి దీనికి ధీటుగా కారు పార్టీ ఏరకంగా ప్రచారాన్ని చేస్తుందన్నది చూడాల్సి ఉంది.