అలకలు.. అసంతృప్తుల మధ్య విజయభేరి యాత్ర

కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌ తర్వాత సీనియర్ల అలకలు.. నిరసనలు, అసంతృప్తి రాగాలు తారా స్థాయికి..

Update: 2023-10-29 02:09 GMT

కాంగ్రెస్‌ రెండో జాబితా తర్వాత సీనియర్ల అలకలు.. నిరసనలు, అసంతృప్తి రాగాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రెండో జాబితాతో టికెట్ల పంచాయితీ జరుగుతుండగానే విజయభేరి యాత్ర మొదలుపెట్టారు పీసీసీ పెద్దలు. నిన్నటి వరకు ఢిల్లీలో టికెట్లపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టింది. ఉత్తర తెలంగాణలో తొలివిడత పూర్తి చేసిన హస్తం పార్టీ.. సెకండ్‌ ఫేజ్‌లో దక్షిణ తెలంగాణతో పాటు.. గ్రేటర్‌పై ఫోకస్‌ పెట్టింది. గ్యారెంటీలను జనాల్లోకి బలంగా తీసుళ్లడమే లక్ష్యంగా యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌కు ముందున్న సవాళ్లు ఏమిటి?

వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి మొదలైన విజయభేరి యాత్ర నవంబర్‌ 2 వరకు కొనసాగనుంది. ఈనెల 18 నుంచి మూడురోజుల పాటు రాహుల్‌, ప్రియాంక చేతుల మీదుగా ఉత్తర తెలంగాణలో తొలివిడత విజయభేరి బస్సు యాత్ర చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో యాత్ర సాగింది. సెకండ్‌ ఫేస్‌ యాత్రను దక్షిణ తెలంగాణతో పాటు.. గ్రేటర్‌ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఉండేలా షెడ్యూల్‌ చేసింది రాష్ట్ర నాయకత్వం. 6 రోజుల యాత్రలో డీకే శివకుమార్‌, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, రాహుల్‌ పాల్టొంటారని పార్టీ చెబుతోంది.

తాండూరు నుంచి మొదలైన రెండో దశ యాత్రలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు. అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సరిహద్దు ప్రాంతం కూడా కావడంతో అక్కడ సహజంగానే ఆయా వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. 

Tags:    

Similar News