రోడ్డు పక్కన హోటల్‌లో దోశెలు వేసి.. వాటిని తిని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగిత్యాలకు వచ్చే ముందు ఉదయం రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఆగి దోశెలు తిన్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగిత్యాలలో పర్యటించారు. ఆయన జగిత్యాలకు వచ్చే ముందు ఉదయం రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఆగి దోశెలు తిన్నారు. దోశెలు కూడా ఆయన వేశారు. దోశెలు రుచిగా ఉన్నాయంటూ హోటల్ యాజమానిని ప్రశంసించారు. అక్కడ ఉన్న సామాన్యులను పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు చాక్లెట్లను అందించారు. సామాన్యులలో ఒక్కడిగా మమేకమైన రాహుల్ గాంధీని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమి కూడారు.
ఓబీసీ జనగణన చేపడతాం...
తెలంగాణలో ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. జగిత్యాలలో ఆయన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు. దేశంలో 90 శాతం ఐఏఎస్, ఐపీఎస్‌లు అగ్రవర్ణాలే ఉన్నారన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు మద్దతు ధరను పదిహేను వేలకు పెంచుతామని చెప్పారు. దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళుతుందని రాహుల్ ఆరోపించారు.
సామజిక తెలంగాణనే...
సామాజిక తెలంగాణ లక్ష్యంగానే కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ఓబీసీ కులగణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఓబీసీలు కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నారా? అని ఆయన నిలదీశఆరు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలని పిలుపు నిచ్చారు. బీజేపీ తన పదవి లాక్కుందని, తన ఇల్లును లాక్కుందన్నారు. తనకు ఇల్లు లేకపోయినా ప్రజల గుండెల్లో స్థానం ఉందని రాహుల్ అన్నారు. అధికారంలోకి రాగానే బీసీ కులగుణన చేపడతామన్నారు.
రెండు పార్టీలూ ఒకటే...
జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారని, ఆయన శాసనసభకు పంపాలని కోరుతున్నారు. లక్ష్మణ్ కుమార్ ను కూడా గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన ఆయన ఈసారి కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని ఆయన చెప్పారు. రెండు పార్టీలు ఒకటేనని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.