Nominations : ఈరోజు చివరి గడువు... అత్యధికంగా దాఖలవుతాయని అంచనా.. రీజన్ ఇదే

తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. దాదాపు అన్ని పార్టీలూ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి

Update: 2023-11-10 02:50 GMT

తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. దాదాపు అన్ని పార్టీలూ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. కొందరు తమ పేర్లు ప్రకటించకముందే మంచిరోజు ఉండటంతో నిన్ననే నామినేషన్ వేశారు. ఇక బీఫారాలు మాత్రమే అందచేయాల్సి ఉంది. నేటితో నామినేషన్లు గడువు ముగియనుండటంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా వేసే అవకాశముందన్న అంచనాలు వినిపడుతున్నాయి. ప్రతి పార్టీ తమ ప్రత్యర్థిని ఓడించడానికి అదే సామాజికివర్గానికి చెందిన అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడుతూ వస్తున్నాయి.

గుర్తుల విషయంలో...
పైగా గుర్తుల విషయంలో కూడా ప్రజల్లో అయోమయం సృష్టించడానికి నామినేషన్ల చివరి రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని చెబుతున్నారు. నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు ఈరోజు బీఫారంలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలనను జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు పదిహేనోతేదీ వరకూ గడువు ఉంది. ఈ నెల30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3వ తేదీన కౌంటింగ్ ను నిర్వహిస్తారు. నిన్న ఒక్కరోజే 1,077 నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 119 నియోజకవర్గాల్లోనూ నిన్న నామినేషన్ల సందడి కొనసాగింది.


Tags:    

Similar News