Telangana Elections : తెలంగాణలో మొదలయిన పోలింగ్

ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది

Update: 2023-11-20 07:04 GMT

ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే వాస్తవానికి తెలంగాణలో పోలింగ్ మాత్రం ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానుంది. కానీ నిన్నటి నుంచే ఇంటి వద్దకే వెళ్లి ఎన్నికల అధికారులు ఓటింగ్ హక్కును ఉపయోగించుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు కేటాయించిన తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకోని వాళ్లు డిసెంబరు 26వ తేదీన వినియోగించుకునే వీలుంది.

ఇంటివద్దకు వెళ్లి...
మెదక్ జిల్లాలో 28 మంది, నల్లగొండ జిల్లాలో మరికొందరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు వెళ్లలేని వారు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి ఓటు హక్కు వినియోగించే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా కొన్ని తేదీలను కేటాయిస్తారు. ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది.


Tags:    

Similar News