BRS : బలమెంతో.. బలహీనతలు అన్నే... హ్యాట్రిక్ విక్టరీకి అవకాశాలు.. అడ్డంకులేంటి?
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్డర పడుతుంది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. బీఆర్ఎస్ పరిస్థితిపై అంచనాలు ఇవే
తెలంగాణలో సాధారణ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్డర పడుతుంది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయింది. గెలుపోటములపై ఇప్పటికే తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోను ఉత్కంఠ నెలకొంది. భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఈసారి వేవ్ కాంగ్రెస్ వైపు ఉందని కొందరు అంటుంటే.. అధికార పార్టీ బీఆర్ఎస్ మరొకసారి అధికారంలోకి రాగలదన్న నమ్మకంతో మరికొందరు ఉన్నారు. హ్యాట్రిక్ విజయం ఖాయమని నమ్ముతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తమదే అధికారం అన్న ధీమాలో ఉంది.
జనం మూడ్...
అయితే ఏపార్టీకి ఆ పార్టీకి అనుకూలతలు ఉన్నాయి. బలహీనతలు లేకపోలేదు. గెలుపుకు అవకాశాలు ఎంత ఉన్నాయో... అన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఒక్కో పార్టీది ఒక్కో వ్యవహారం. ఒక్కోరకమైన తీరు. ప్లస్ లు మైనస్ లు అన్ని పార్టీలకూ ఉన్నాయి. ముందుగా అధికార బీఆర్ఎస్ ను తీసుకుంటే బలాలు, బలహీనతలు ఈ కింది విధంగా ఉన్నాయి. అలాగని జనం మూడ్ ను చివరి వరకూ చెప్పలేని పరిస్థితి. చివరి రోజు తాము ఏమనుకుంటారో ఆ పార్టీకే ఓటు వేస్తారని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
బలాలు :
రైతుబంధు
ఆసరా పింఛన్లు
కల్యాణ లక్ష్మి
మిషన్ భగీరధ
24 గంటలు విద్యుత్
ఇంటింటికి నల్లా
బలహీనతలు :
పదేళ్ల పాలనపై వ్రజల్లో వ్యతిరేకత
నిరుద్యోగం - ఇంటికో ఉద్యోగం అని మాట తప్పిన వైనం
నిరుద్యోగ భృతి ఇస్తామని నెరవేరని హామీ
అవినీతి ఆరోపణలు
డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు
సిట్టంగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
అవకాశం :
యాభై సీట్లు వచ్చినా ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి వచ్చే వారితో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం.