Rapido: రాపిడో బంపర్‌ ఆఫర్‌.. పోలింగ్‌ రోజు ఉచిత రైడ్‌

మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లు తమ తమ సొంతూళ్లకు చేరుకుని..

Update: 2023-11-27 16:33 GMT

మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లు తమ తమ సొంతూళ్లకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక నగరాల్లో కూడా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటారు. హైదరాబాద్‌ నగరాల్లో ఓటు వేసేందుకు బైక్‌లు, కార్లు, ఆటోలు ఇలా రకరకాల వాహనాలపై వెళ్లి ఓటు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 30వ తేదీన ఓటు వేసేవారిని ఉచితంగా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాపిడో వెల్లడించింది. ఈ మేరకు ర్యాపిడో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎన్నికల రోజున హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ కేంద్రాలకు ఉచిత రైడ్‌ల సదుపాయం కల్పిస్తున్నట్లు రాపిడో ప్రకటించింది.

తమకు అత్యధికంగా ఉండే యువతను ఉచితంగానే పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు తాము ఉచిత బైక్‌ రైడ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసే అవకాశం వస్తుండగా, హైదరాబాద్‌ అర్బన్‌లో ఓటర్ల సంఖ్య సవాల్‌గా మారింది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అర్బన్ నియోజకవర్గాల్లో 40 శాతం నుంచి 55 శాతం మధ్య ఓటింగ్ నమోదు అవుతోంది.

అది ఎలా పని చేస్తుంది

వినియోగదారులు iOS లేదా Androidలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసి, బుకింగ్ ప్రారంభించవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత రైడ్ వివరాలు హోమ్‌పేజీలో కనిపిస్తాయి. కెప్టెన్‌లు వెంటనే పికప్ లొకేషన్‌కు చేరుకుంటారు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి, రాపిడో కెప్టెన్లు అదనపు హెల్మెట్‌ని తీసుకువెళతారు.


Full View


Tags:    

Similar News