KCR : గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు... బుజ్జగిస్తున్న నేతలు
కేసీఆర్ నామినేషన్ వేసిన గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి
కేసీఆర్ నామినేషన్ వేసిన గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఈ నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన వారు వందకు మంది పైగా నామినేషన్లు వేశారు. అలాగే మూతబడిన చెరుకు ఫ్యాకర్టీని తిరిగి తెరవాలని నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు నిరుద్యోగ సమస్య పరిష‌్కరించలేదని కోరుతూ ముప్ఫయికి మందికిపైగా నామినేషన్ పత్రాలను గజ్వేల్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
పెద్ద సంఖ్యలో...
మొత్తం 127 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. 157 సెట్ల నామినేషన్లు గజ్వేల్ నియోజకవర్గంలో పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమయింది. నామినేషన్లను వేసిన వారిని బుజ్జగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వారికి ఫోన్లు చేసి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతుంది. తాము అధికారంలోకి రాగానే సమస్యలకు పరిష్కారం చూపుతామని నేతలు హామీ ఇస్తున్నారు. కొందరు నామినేషన్లు వేసిన వారు అంగీకరిస్తుండగా, మరికొందరు ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిగడువు 15వ తేదీ కావడంతో ఉపసంహరించుకుంటారా? లేదా? అన్న టెన్షన్ గులాబీ పార్టీ నెలకొంది.