Telangana Elections : ప్రచారానికి బ్రేక్.. అభ్యర్థులంతా ఇంటికే పరిమితం

తెలంగాణ ఎన్నికలకు ఇంకా పద్దెనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈరోజు అభ్యర్థులందరూ ప్రచారానికి విరామం ప్రకటించారు.;

Update: 2023-11-12 06:06 GMT
campaigning, all parties, break, telangana elections
  • whatsapp icon

తెలంగాణ ఎన్నికలకు ఇంకా పద్దెనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈరోజు అభ్యర్థులందరూ ప్రచారానికి విరామం ప్రకటించారు. దీపావళి కావడంతో అభ్యర్థులు కూడా ప్రచారానికి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి పండగ రోజు ప్రచారానికి వెళ్లిన ప్రజలు హర్షించరని భావించిన నేతలందరూ ఈ రోజు ప్రచారానికి విరామమిచ్చారు.

పండగ పూట...
గత కొద్ది రోజులుగా అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అభ్యర్థులందరూ ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు దీపావళి కావడంతో ఒక్కరోజు విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలోనూ ఎటువంటి ప్రచారం జరగడం లేదు. మైకుల గోలలేదు. బైకుల రణగొణధ్వని లేదు. రోడ్లపైన అభ్యర్థుల తరుపున తిరిగే వారంతా పండగ చేసుకోవడానికి ఇంటికి పరిమితం అవడంతో అభ్యర్థులు కూడా ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.


Tags:    

Similar News