రామప్ప ఆలయంలో రాహుల్

రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు

Update: 2023-10-18 11:58 GMT

రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించి ములుగు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బేగంపేట్‌ కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఘనంగా స్వాగతం పలికారు.

మహిళ డిక్లరేషన్‌‌ను...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబులు వారిరువురికీ స్వాగతం పలికారు. రామలింగేశ్వర ఆలయంలో పూజల అనంతరం విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు వారు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంకలను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు. రామప్పగుడిలో వారు పర్యటించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ములుగు సభలో మహిళ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.


Tags:    

Similar News