Rahul Gandhi : దోచుకున్నది కక్కిస్తాం.. ప్రజల అకౌంట్‌లో వేసేస్తాం

పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, కాంగ్రెస్ తుపానులో ఈసారి కొట్టుకుపోక తప్పదని రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2023-11-17 08:05 GMT

పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, కాంగ్రెస్ తుపానులో ఈసారి కొట్టుకుపోక తప్పదని రాహుల్ గాంధీ అన్నారు. పినపాకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని రాహుల్ అన్నారు. మీరు చదివిన స్కూల్, వేసిన రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిందేనని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడం ఖాయమని అన్నారు.

ఆ మూడూ ఒక్కటే...
కేసీఆర్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతామని తెలిపారు. రైతులు, పేదలను కేసీఆర్ వంచించారని తెలిపారు. వారు దోచుకున్న డబ్బులను పేదల అకౌంట్లలోకి వేస్తామన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటకలోనూ వెంటనే గ్యారంటీలను అమలు చేశామని ఆయనగుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలూ ఒక్కటేనన్న రాహుల్ కాంగ్రెస్ ను ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు.


Tags:    

Similar News