Revanth reddy : కరెంట్ బిల్లులు ఎవరూ కట్టొద్దు... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాఫీ
24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గద్వాల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అనవసరంగా బురద జల్లు తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు విద్యుత్తు అందిస్తామని తెలిపారు.
బోయలను ఎస్టీ జాబితాలోకి...
ఇప్పుడు విద్యుత్తు బిల్లులు చెల్లించవద్దని, కాంగ్రెస్ రాగానే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. వాల్మీకి, బోయలలకు గద్వాల టిక్కెట్ల కాంగ్రెస్ ఇవ్వాలనుకుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తివేసి అంతకంటే మంచిగా రైతులకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గద్వాల్ లో సరితమ్మను గెలిపించాలని ఆయన కోరారు.