HarishRao : తొమ్మిదేళ్లలో కరువులేదు.. కర్ఫ్యూ లేదు
కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కరవులేదు, కర్ఫ్యూ లేదని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్ లో ఆయన మాట్లాడారు
కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కరవులేదు, కర్ఫ్యూ లేదని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పొలాలన్నీ పచ్చగా ఉన్నాయన్నారు. గుంటలన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయన్నారు. ఒకనాడు బతుకమ్మ కలుపుదామంటే చెరువులో నీళ్లు ఉండేవి కావని, కానీ నేడు అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రైతు రుణ మాఫీ పూర్తిగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి కోరామని, అనుమతి వచ్చిన వెంటనే వారికి కూడా రైతు రుణ మాఫీ అమలు చేస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలను...
మంచి అజెండా కేసీఆర్ మనకు ఇచ్చారన్నారు. ఇంటింటికి తిరిగి రెండు వందలున్న పింఛన్ ను రెండు వేలు చేసుకున్నామని, దీనిని క్రమంగా ఐదు వేల రూపాయలు చేసుకుందామని తెలిపారు. పేదలకు రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సన్నరకం బియ్యం ఇస్తామని తెలిపారు. పేదలు కడుపు నిండా తినాలనే సన్నబియ్యం అందచేస్తామని తెలిపారు. సన్న బియ్యం కావాలంటే కారుకు, కేసీఆర్ కు ఓటేయాలని హరీశ్ రావు అన్నారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని, ఆరోగ్య లక్ష్మి, గృహలక్ష్మితో పాటు సౌభాగ్య లక్ష్మిని కూడా అమలు చేస్తామని తెలిపారు. నెలనెలా సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు నెలనెల మూడు వేల రూపాయలు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు.