Telangana Elections : పోలింగ్ ప్రారంభం...చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ను అధికారులు ప్రారంభించా
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు స్వల్ప సంఖ్యలోనే కేంద్రాలకు వచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి పెద్దగా కనిపించడం లేదు. ఒకరిద్దరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళుతున్నారు.
2,290 మంది...
119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈరోజు 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో 1.63 లక్షల మంది మహిళ ఓటర్లు కాగా, 1.62 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు. 2,676 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 119 నియోజకవర్గాల్లో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు వేల పోలింగ్ కేంద్రాల వరకూ సమస్యాత్మకమైనవి గుర్తించారు.
భారీ బందోబస్తు...
సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 75 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన పథ్నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకే సాగుతుంది. మిగిలిన చోట్ల ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. ఐదు గంటలకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.