Revanth Reddy : నేడు నాలుగు నియోజకవర్గాలకు రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాలుగు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు.;

Update: 2023-11-21 04:35 GMT
revanth reddy, tpcc president, four constituencies, telangana, elections
  • whatsapp icon

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆరు గ్యారెంటీలను, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫేస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలంగా ప్రయత్నిస్తుంది.

రోడ్ షోలు... బహిరంగ సభలు...
ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్యం 12 గంటలకు వనపర్తిలోనూ, మధ్యాహ్నం రెండు గంటలకు నాగర్ కర్నూల్ , మధ్యాహ్యం 3.30 గంటలకు అచ్చంపేటలో జరిగే బహిరంగ సభల్లోనూ, సాయంత్రం ఆరు గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ షోలో రేవంత రెడ్డి పాల్గొననున్నారు. వరస సభలతో రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు.


Tags:    

Similar News