కేసీఆర్‌పై పోటీ చేస్తా - ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికల వేడి జోరందుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాత ఆయా పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలు..

Update: 2023-10-13 04:19 GMT

తెలంగాణ ఎన్నికల వేడి జోరందుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాత ఆయా పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతల జాబితా విడుదల కాగా, అటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా తమ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ముందే ఎన్నికల సమయంలో నేతల్లో జోష్‌ జోరుగా కనిపిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నుంచి నామినేషన్లు వేయునన్నారు. ఈ సందర్భంగా తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్ బీజేపీ కార్యకర్తల మీటింగ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తున్నాయి. తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లోను, గజ్వేల్ లోను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ లాగా తాను కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తానని, రెండింటిలోనూ తానే గెలుపొందుతానని, కేసీఆర్‌ను ఓడిస్తానని ఈటల పేర్కొన్నారు.

Tags:    

Similar News