8 శతాబ్దాల దిగుడు బావి ,శిధిల శిల్పాలను కాపాడుకోవాలి

నల్లగొండ ,డిసెంబర్ 31: కళ్యాణి చాళుక్య, కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ఈమని శివ నాగిరెడ్డి అన్నారు.

Update: 2023-12-31 09:45 GMT

నల్లగొండ ,డిసెంబర్ 31: కళ్యాణి చాళుక్య,

కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. స్థానిక ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పానగల్లు పరిసరాల్లోని 800 సంవత్సరాల నాటి మెట్ల బావి, ఆలయ విడిభాగాలు ,శిల్ప శకలాలను ఆయన ఆదివారం నాడు పరిశీలించారు . పానగల్లు పచ్చల సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం కుడివైపున రోడ్డు పక్కన ఉన్న కందూరు చోళుల కాలపు దిగుడు బావి గతంలో అనేకసార్లు పునర్ నిర్మించబడిందని ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని చారిత్రక ప్రాధాన్యత కలిగినవీటిని పదిల పరచాలన్నారు .





పానగల్లు వెంకటేశ్వర ఆలయం ముందు, మాణిక్యమ్మ గుడి ముందు ఉన్న కాకతీయుల కాలపు మండపస్తంభం విరిగిన చెన్నకేశవ శిల్పం, తల వరకు మాత్రమే కనబడుతున్న బ్రహ్మదేవుని మూడు తలల భిన్నమైన శిల్పం, పానవట్టం అలనాటి శిల్పుల పనితనానికి అద్ధం పడుతున్నాయని పురావస్తు ప్రాధాన్యత గల ఎనిమిది శతాబ్దాల ఈ చారిత్రక అన్నవాళ్ళపై అవగాహన కలిగించిన శివనాగిరెడ్డి వాటిని కాపాడి భావితరాలకు అందించాలని పానగల్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో గంటల అనంతరెడ్డి ఇంకా పానగల్ ప్రజలు పాల్గొన్నారు.



 



 



Tags:    

Similar News