కల్తీ పాల దందాకు తెరలేపిన ముఠా అరెస్ట్

ఈ క్రమంలోనే కర్నూల్ నుండి శంషాబాద్ మీద గా నాగపూర్ వెళ్తున్న పాల ట్యాంకర్ నుండి పాలను తీసి అందులో నీళ్లు పోస్తున్నారు.

Update: 2023-07-24 03:34 GMT

హైదరాబాదు నగరంలో కేటుగాళ్లు తమ స్వార్థం కోసం తినే పదార్థాలను సైతం కల్తీ చేస్తున్నారు. ఓ ముఠా ఏకంగా కల్తీ పాల దందాకు తెరలేపింది. పక్కా సమాచారం రావడంతో వెంటనే శంషాబాద్ పోలీసులు కల్తీ దందా కొనసాగిస్తున్న ముఠాను పట్టుకొని గుట్టరట్టు చేశారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. వీరి వద్దనుండి మూడువేల లీటర్ల పాలతో పాటు టిన్నులను, పాల ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కు చెందిన శేఖర్ అనే వ్యక్తి మేడ్చల్లో స్వీట్ షాప్ బిజినెస్ చేస్తున్నాడు. సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించేందుకు నిర్ణయించుకున్న శేఖర్ ముగ్గురు ఆటో డ్రైవర్లు, ఒక పాల ట్యాంకర్ డ్రైవర్ తో కలిసి నకిలీ పాల దందాకు తెరలేపాడు.

ఈ క్రమంలోనే కర్నూల్ నుండి శంషాబాద్ మీద గా నాగపూర్ వెళ్తున్న పాల ట్యాంకర్ నుండి పాలను తీసి అందులో నీళ్లు పోస్తున్నారు. తొమ్మిది వేల లీటర్ల పాలలోడుతో వెళ్తున్న పాల ట్యాంకర్ నుంచి నలుగురు నిందితులు 3000 లీటర్ల పాలను బయటకు తీసి అనంతరం పాల ట్యాంకర్ లో ఉన్న పాలల్లో నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నారు. ఈ ముఠా 40 లీటర్లు కలిగిన 83 పాల టిన్నులను తీసుకువచ్చి పాలను ఈ విధంగా దొంగలిస్తున్నారు. శంషాబాద్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఆ ముఠాపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ పోలీసులు శేఖర్ నియమించిన ముగ్గురు ఆటో డ్రైవర్లు చండీలాల్, చేతన్, సచిన్ తో పాటు వీరికి సహకరించిన పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకన్నను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అసలైన ప్రధాన సూత్రధారి అయిన శేఖర్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి 3000 లీటర్ల పాలతో పాటు, టిన్నులను, పాల టాంకర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Tags:    

Similar News