హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

అల్లుఅర్జున్ తన అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు

Update: 2024-12-13 08:34 GMT

Telangana high court

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడంతో దానిపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్వాష్ పిటీషన్ పై మధ్యాహ్నం విచారణకు రానుంది.

నాన్ బెయిల్ కేసులు...
అయితే ఇప్పటికే అల్లు అర్జున్ పై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. తను సోమవారంవరకూ అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలంటూ వేసిన పిటీషన్ పై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.


Tags:    

Similar News