Pawan Kalyan : నేడు భద్రాద్రికి పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు భద్రాచలం రానున్నారు;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నేడు హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. ఖమ్మం జిల్లాకు వస్తున్న పవన్ కల్యాణ్ కు జనసేన నేతలు భారీగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. భద్రాద్రి రామయ్యకు ఏపీ ప్రభుత్వం తరుపున ముత్యాల తలంబ్రాలను పవన్ కల్యాణ్ సమర్పించనున్నారు.
రోడ్డు మార్గంలో...
మధ్యాహ్నం పన్నెండు గంటలలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిరోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రేపు జరిగే సీతారామ కల్యాణంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రేపు సాయంత్రం ఐదుగంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి తిరిగి రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.