కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు;

Update: 2022-02-13 03:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించారు. రాహుల్ రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి ఆధారాలు చూపాలని హిమాంత బిస్వాశర్మ అన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర ఫైర్ అయ్యారు. బీజేపీ పూర్తిగా దిగజారిపోయిందని, త్యాగాలు చేసిన కుటుంబాన్ని కించపర్చడం తగదని, ఆ మాటలు విని తనకు కన్నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

సైన్యంపై మాట్లాడినప్పుడు....
దీనికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బదులిచ్చారు. రాహుల్ గాంధీ భారత సైన్యం పై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించకూడదన్న కేసీఆర్ ఆలోచన ధోరణి మారాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.


Tags:    

Similar News