శ్రీనివాస్ గౌడ్ కేసు...ఢిల్లీకి బీజేపీ బృందం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.;

Update: 2022-03-03 07:36 GMT
bandi sanjay, bjp, srinivasa goud, conspiracy to murder
  • whatsapp icon

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఒక బృందం ఢిల్లీ బయలు దేరి వెళ్లనుంది. అధినాయకత్వానికి ఈ కేసు గురించి తెలియజేయనుంది. డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

అన్ని దర్యాప్తు సంస్థలకు...
ఈరోజు సాయంత్రం బండి సంజయ్ పార్టీ లీగల్ సెల్ తో సమావేశం కానున్నారు. దీనిపై అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదిక పంపింది.


Tags:    

Similar News