ఈడీ ఎదుట నేడు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు

ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట నేడు విచారణకు హాజరు కాలేదు;

Update: 2025-01-02 08:09 GMT
bln reddy, enforcement directorate, formula e car racing case,  did not appear
  • whatsapp icon

ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట నేడు బీఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాను ఈరోజు విచారణకు రాలేనని, తనకు విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. ఇందుకు ఈడీ అధికారులు కూడా మరో తేదీన రావాల్సి ఉంటుందని, తేదీని త్వరలో తెలియజేస్తామని ఈడీ అధికారులు తెలియజెప్పారు.

విచారణకు రాలేనని...

ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఈరోజు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారణకు పిలిచారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, ఈనెల 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరి అరవింద కుమార్ నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News