రేపు రోశయ్య అంత్యక్రియలు

కొణిజేటి రోశయ్య పార్థీవ దేహాన్ని అమీర్ పేట్ లోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.;

Update: 2021-12-04 04:36 GMT
kongeti rosaiah, ex chief minister, kompally, farm house
  • whatsapp icon

కొణిజేటి రోశయ్య పార్థీవ దేహాన్ని మరికాసేపట్లో అమీర్ పేట్ లోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. స్టార్ ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడే ఈరోజు పార్ధీవదేహాన్ని ఉంచుతారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుాల సందర్శనార్థం రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ లో ఉంచుతారు. అక్కడి నుంచి నేరుగా మహా ప్రస్థానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు...
రోశయ్య అసమాన్యమైన వ్యక్తి అని కేవీపీ రామచంద్రరావు అన్నారు. స్టార్ ఆసుపత్రిలో ఉన్న రోశయ్య పార్ధీవదేహాన్ని కేవీపీ, షబ్బీర్ ఆలీలు సందర్శించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ రోశయ్య వద్ద వైఎస్ ఆర్థిక క్రమ శిక్షణ నేర్చుకున్నారన్నారు. వైఎస్ రోశయ్యను పెద్దదిక్కుగా భావించేవారన్నారు. తనకు ఒక తండ్రిలా, అన్నలా సలహాలిచ్చేవారని కేవీపీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్రమైనా, వ్యవస్థ అయినా, కుటుంబమైనా ఆర్థిక క్రమశిక్షణ ఎలా పాటించాలన్న విషయాన్ని రోశయ్య నుంచి అందరూ నేర్చుకోవాలన్నారు.


Tags:    

Similar News