యాదాద్రిలో హరీశ్ రావు రైతు రుణమాఫీపై
రుణమాఫీపై ప్రభుత్వం మాటతప్పిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు.
రుణమాఫీపై ప్రభుత్వం మాటతప్పిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఆయన ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని హరీశ్ రావు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పినందుకు ఆయన పాప పరిహార పూజలు నిర్వహించారు.
ప్రభుత్వం విఫలమయిందని...
రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమయిందన్న హరీశ్ రావు తెలంగాణలో ప్రతి చోట దేవుడు మీద ఒట్టేసి చెప్పారన్నారు. అందుకే తాము రైతులను రుణం నుంచి విముక్తి చేయాలంటూ టెంపుల్ టూర్ కు పెట్టుకున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి ఒట్టేసిన ఆలయాలన్నీ తాము పర్యటించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. యాదాద్రి నుంచి తమ పర్యటన ప్రారంభమయిందని చెప్పారు.